Breaking News

వచ్చే రబీ సీజన్ నుంచి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ..

05 th Oct 2020, UTC

న్యూఢిల్లీ :వచ్చే రబీ సీజన్లో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పధకంలో భాగంగా పంటలను సాగు చేసిన రాష్టాలకు మార్కెటింగ్ లో ప్రోత్సాహం అందించాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో పలు ప్రాంతాల్లో పలు రకాల పంటలు సాగవుతన్నాయి. నేలలు, ఉష్టోగ్రతలు, సాగు భిన్నంగా వున్న కారణంగా ఆయా ప్రాంతాల్లో ప్రాముఖ్యత వున్న పంటలను ప్రోత్సహించాలనేది కేంద్రం ఆలోచనగా వుంది. కర్ణాటకలో రాగి, తమిళనాడులో సనప్లవర్, ఏపీలో మిర్చి, మహారాష్ట్రలో ఆల్ఫాన్సా మామిడి పండ్లను సాగుచేసే జిల్లాలను ఎంపిక చేసి వాటిపై దృష్టి పెడతారు.

దేశంలో 540 జిల్లాలు వుండగా వాటిలో 100 జిల్లాలవరకు జిఐ ట్యాగ్ వున్న పంటలు సాగవుతున్నాయి. అంటే ఆయా జిల్లాల్లో భిన్నమైన పంటలు సాగవుతున్నాయి. ఆయా పంటల సాగుకు అవసరమైన వాతావరణ పరిస్దితులు అక్కడ వున్న నేపధ్యంలో వాటి ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వాలు పెంచగలిగితే వాటి మార్కెటింగ్, ఎక్ప్ పోర్ట్ ల బాధ్యత కేంద్రం తీసుకుంటుంది. దీనివలన రైతులు కూడ తమ పంటలకు మంచి ధర పొందే అవకాశముంటుంది.

మరో వైపు గత వారంరోజుల్లో రూ.1,082.46 కోట్ల విలువైన 5.73 లక్షల టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు కేంద్ర ఆహార శాఖ తెలిపింది.ధాన్యం కొనుగోళ్లు పంజాబ్, హర్యానాల్లో సెప్టెంబర్ 26న, మిగిలిన రాష్ట్రాల్లో సెప్టెంబర్ 28న ప్రారంబించారు. ఈ ఏడాదికి ఏ గ్రేడ్ రకం ధాన్యానికి  క్వింటాల్ కు రూ.1,888 , సాధారణ రకానికి రూ.1,868  మద్దతు ధరను నిర్ణయించారు. ధాన్యంతో పాటు ప్రత్తి కొనుగోళ్లను అక్డోబర్ 3నుంచి ప్రారంబించారు. కేంద్రం కొత్తగా చేసిన వ్యవసాయ చట్టాలక నిరసనగా పంజాబ్, హర్యానాల్లో రైతలు నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. దీనితో గతం కంటే భిన్నంగా అదికారులు పంటల కొనుగోలుకు సంబందించి ప్రతి రో్జు రైతులకు సమాచారం ఇస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox