క్రిప్టోకరెన్సీ లకు సుప్రీం పచ్చ్చజెండా..!

post

గతం లో ఓసారి క్రిప్టో కరెన్సీ తో లావాదేవీలు జరపరాదంటూ ఆర్బీఐ భారత బ్యాంకుల్ని ఆదేశించింది. వర్చ్యువల్ కరెన్సీ లేదా బిట్ కాయిన్స్ గా పిలవబడే క్రిప్టో కరెన్సీ ను ఆర్బీఐ నిషేధించింది. ఈ ఆదేశాలను ఆర్బిఐ 2018 జారీ చేసింది. ఐతే, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఇంట‌ర్నెట్ మొబైల్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా సుప్రీమ్ కోర్టు ను ఆశ్రయించింది. వాటిపై విచారణ జరిపిన సుప్రీమ్ కోర్టు సానుకూల తీర్పు ని ఇచ్చింది. ఆర్బీ ఐ ఆదేశాలను కొట్టిపారేసింది. ఈ ధర్మాసనం లో రోహిట‌న్ నారీమ‌న్‌, ర‌వీంద్ర భ‌ట్‌, సుబ్ర‌మ‌ణియ‌న్‌లు జడ్జిలుగా వ్యవహరించారు. ట్రేడింగ్ లో క్రిప్టో కరెన్సీ ని నిషేధించడాన్ని కోర్టు తప్పుపట్టింది. నిజానికి, ఆర్బీఐ కేవలం బ్యాంకు లావాదేవీలకు మాత్రమే క్రిప్టో కరెన్సీ ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం, ఈ ఆదేశాలను కూడా కోర్టు కొట్టివేసింది.