శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్‌..!

post

అల.. వైకుంఠపురములో సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర బృందం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో వారు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్‌ వేంకటేశ్వరుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు పుచ్చుకున్నారు. వారితో పాటు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, నిర్మాతలు రాధాకృష్ణ‌, బ‌న్నీవాసు కూడా ఉన్నారు.