భారత జలాల్లోకి చైనా అండర్ వాటర్ డ్రోన్లు...!

post

భారత్ దేశ సమీపం లోని హిందూ మహా సముద్రం లోనికి ఒక డజను వరకు అండర్ వాటర్ డ్రోన్లను మోహరించేందుకు చైనా సిద్మవుతోంది. దీనితో, భారత్ అప్రమత్తమైంది.  ఓషియానిక్ రీసర్చ్, హైడ్రోగ్రాఫిక్ సర్వే లో భాగం గా చైనా వీటిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తోంది. అయితే, వీటి వెనుక వేరే దురుద్దేశాలు కూడా ఉండి ఉండొచ్చని భారత్ భావిస్తోంది. 
     డీప్ సీ మైనింగ్  మరియు ఇతర వాణిజ్య సంబంధ కార్యకాపాల కోసమే చైనా ఈ పనులు చేయబోతున్నట్లు భారత్ కు ఇప్పటికే అనుమానం ఉంది. అంతేకాకుండా, సబ్ మెరైన్ ఆపరేషన్లకు కూడా వీటిని చైనా ఉపయోగించుకోవచ్చు. అందుకే భారత్ అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. మొన్నామధ్య ఓసారి, ఓ చైనా నౌక భారత జలాలవైపు వచ్చింది. నేవీ అధికారులు ఆ నౌకను హెచ్చరించడం తో ఆ నౌక తిరిగి వెనుకకు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి, ఇటువంటి ఘటన మరోసారి చోటు చేసుకోలేదు. కేవలం మిలిటరీ కార్యక్రమాల కోసమే ఆ నౌక భారత్ జలాలపైకి వచ్చి ఉండవచ్చని భారత నేవీ అధికారులు భావిస్తున్నారు.