సత్య నాదెళ్ల అర్ధాంగి రెండు కోట్ల విరాళం..!

post

కరోనా వైరస్ ముప్పు భారీగా ముంచుకొచ్చిన నేపధ్యం లో పలువురు ప్రముఖులు ఈ వైరస్ పై పోరాడటానికి విరాళాలు అందచేస్తున్నరు. తమకు తోచినంత సాయం ప్రకటిస్తున్నారు. నిన్న, రిలయన్స్ సంస్థలు ఉచిత ఇంధనాన్ని, పేదవారికి భోజన ఏర్పాట్లను, రోజుకు  లక్ష మసుకులను ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల అర్థాంగి అనుపమ భారీ విరాళాన్ని ప్రకటించారు. కరోనా వైరస్ పై పోరాడటానికి రెండు కోట్ల నిధులను అందించారు. ఈ నిధులను అనుపమ తండ్రి ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయనిధికి అందించారు.