రేట్లు ఎక్కువ చెప్తున్నారా..? ఈ నెంబర్ కు కాల్ చేయండి..!

post

కరోనా వైరస్ మహమ్మారిని వ్యాప్తి ని అరికట్టే నేపధ్యం లో రాష్ట్రమంతటా లాక్ డౌన్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే అదనుగా తీసుకున్న వ్యాపారస్తులు తమ వ్యాపార కిటుకులు ప్రయోగిస్తున్నారు. అధికంగా ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. దీనితో, నిత్యావసరాలు సామాన్యులకు భారం గా మారాయి. దీనిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్​ ఎంవీ.రెడ్డి ఫైర్ అయ్యారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధరలు పెంచడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. 
     నిత్యావసర వస్తువులు, కూరగాయలను అధిక ధరలకు అమ్మే వ్యక్తులపై కేసు పెడతామని హెచ్చరించారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్​లో పౌరసరఫరాలు, వాణిజ్య పన్నులు, కార్మిక, పోలీస్​శాఖల ఆఫీసర్లతో ఆయన సోమవారం సమీక్షా నిర్వహించారు. అధిక ధరలకు విక్రయించేవారిపై కేసు నమోదు చేసేందుకు వీలుగా కలెక్టరేట్​లో కంట్రోల్​ రూం ఏర్పాటు  చేశామని తెలిపారు. అధిక ధరలకు విక్రయించేవారిపై కేసు నమోదు చేయడానికి  08744241950 నెంబర్ కు డయల్ చేయాలనీ సూచించారు. ఇతర సామగ్రి ఎవరైనా అధిక ధరలకు అమ్మితే 08682 – 22423 లేదా 9440795618, 7901153248 నంబర్లకు వాట్సాప్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ రంగనాథ్  డయల్ 100 లేదా కంట్రోల్ రూమ్ చెప్పుకొచ్చారు.  డయల్ 100 లేదా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ ద్వారా ఐన కూడా సంప్రదించవచ్చని తెలిపారు.