నన్నర్ధం చేసుకోలేదు..: రజనీకాంత్

post

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.  పలువురు సెలెబ్రిటీలు కూడా దీనిపై స్పందించి ప్రజల్లో అవగాహనా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంటిపట్టునే ఉండి జాగ్రత్తగా ఉండాలంటూ సలహాలు ఇస్తున్నారు. సేఫ్ గా ఎలా ఉండాలో చెప్తున్నారు. ఈ నేపధ్యం లో, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. కానీ అది సరిగా అర్ధం చేసుకోకపోవడం వల్ల, అది చర్చనీయాంశమైన అంశం గా మారింది. చివరికి, ట్విట్టర్ స్వయం గా ఆ ట్వీట్ ను తొలగించే పరిస్థితి వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం వల్లనే ఆ ట్వీట్ ను తొలగించాల్సి వచ్చింది అని ట్విట్టర్  వివరణ ఇచ్చింది. 
   ఈ చర్చపై రజనీకాంత్ సోమవారం స్పందించారు. ట్వీట్ చేసిన కొద్దీ గంటల్లోనే ఆ ట్వీట్ ను ట్విట్టర్ తొలగించడం పట్ల ఆయన స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి కారణం గా ప్రజలంతా పన్నెండు నుంచి పదునాలుగు గంటల పాటు బయటకు వెళ్లకుండా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తి మూడవ స్టేజి కు చేరుకోకుండా ఉంటుందని తానూ వ్యాఖ్యానించానని అన్నారు. అయితే, తాను చేసిన వ్యాఖ్యలను ఒకరోజు మాత్రమే చాలు అన్నట్లు గా అర్ధం చేసుకున్నారని తలైవా రజనీకాంత్ వాపోయారు. అందువలనే విమర్శలు తలెత్తాయని, చివరికి ట్విట్టర్ ఆ ట్వీట్ ను  తొలగించిందని ఆయన చెప్పుకొచ్చారు. 
     ఆయన ఇంకా మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటించాలని, కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరు సేఫ్ గా ఉండాలని, అందుకోసం తగిన జాగ్రత్తలు పాటిద్దామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలంతా తమకు తాళముగా నిర్బంధించకుని వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి తోడ్పడాలని ఆయన కోరారు. అలానే, తన వ్యాఖ్యలను ప్రజలలోకి తీసుకెళ్లినవారికి కృతజ్ఞతలు తెలిపారు.