కరోనా ను ధీటుగా ఎదుర్కునే సామర్ధ్యం ఇండియాదే..:డబ్ల్యూహెచ్ఓ

post

కరోనా వైరస్ వ్యాప్తి పై యుద్ధం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ దిశగా సాగుతూ, పలు కీలక నిర్ణయాలు త్వరితగతిన తీసుకుంటున్నారు. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, మరోవైపు వ్యాక్సిన్ ను కనుగొనేందుకు పరిశోధన సంస్థలకు కూడా తోడుగా నిలబడుతున్నారు. ఐతే, ఈ నేపధ్యం లో డబ్ల్యూహెచ్ఓ భారత్ సామర్థ్యం పై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలు భారత్ కు ఉన్నాయని ఉత్సాహపరిచింది. 
  గతం లో ఓసారి, ఇలానే వేధించిన స్మాల్ పాక్స్ (మసూచి), పోలియో వంటి వ్యాధులను భారత్ సమర్ధవంతం గా ఎదుర్కొంది అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఆ అనుభవం తో కరోనా మహమ్మారిని సైతం భారత్ సమర్ధవంతం గా ఎదుర్కొంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జే ర్యాన్ వ్యాఖ్యలు చేసారు. తాజాగా, ఓ సమావేశం లో మాట్లాడుతూ,మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునే అద్భుతమైన సామర్ధ్యం భారత్ కు ఉందని తానూ భావిస్తున్నానని అన్నారు. అయితే, అధిక జనాభా ఉన్న కారణం గా మరిన్ని ఎక్కువ ల్యాబ్ లు ఏర్పాటు చేయవలసి ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. గతం లో ఉన్న అనుభవాలను దృష్టి లో ఉంచుకుని ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.వైరస్ వ్యాప్తిని పటిష్ట చర్యల ద్వారా  అడ్డుకోవాలని సందేశమిచ్చారు.