పీసీసీ రేసులో ముందున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

post

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశముందా? గురువారం ఆయన  కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆమె నివాసంలో భేటీ అయ్యాక ఈ విషయమై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. .  మరో రెండు రోజుల్లో అధికారికంగా కోమటిరెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు అంశం కూడా సోనియా వద్ద చర్చకు వచ్చినట్లుగా భేటీ అనంతరం దిల్లీలో కోమటిరెడ్డి వెల్లడించారు. స్థానిక ఎన్నికల సమయంలో తెరాస చేసిన అక్రమాలను తెలిపానన్నారు. రాష్ట్రంలోని అందర్నీ కలుపుకొని వెళ్లే వ్యక్తికి పీసీసీ బాధ్యతలు అప్పగించాలని.. పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సోనియాను కోరినట్లు కోమటి రెడ్డి తెలిపారు.కొత్త పీసీసీ చీఫ్ ప్రకటన త్వరలోనే వెలువడుతుందన్న కథనాల నేపథ్యంలో సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త పీసీసీ చీఫ్ రేసులో కోమటిరెడ్డి ముందున్నారని ప్రచారం జరుగుతోంది. 
రేవంత్ పరిస్దితి ఏమిటి?
తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికే టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తారని గత ఏడాది ప్రచారం జరిగింది. అయితే పార్టీలో సీనియర్లు అఢ్డుతగిలారు. రేవంత్ దూకుడుకు పీసీసీ పదవి తోడయితే ఇక తమ ఉనికి కష్టమేననుకున్న సదరు పెద్దలు ఏకాభిప్రాయం పేరిట పార్టీ హై కమాండ్ కు తమ అయిష్టాన్ని తెలపడంతో అది అక్కడితో ఆగిపోయింది. తాజాగా రేవంత్ రెడ్డిపై గోపన్ పల్లి భూ ఆక్రమణల వ్యవహారం, డో్న్ వినియోగంపై జైలు కెళ్లడం కూడ వారికి కలిసి వచ్చినట్లయింది. రేవంత్ కు మద్దతుగా నిలవకుండా తనపై వచ్చిన ఆరోపణలకు తానే వివరణ ఇవ్వాలని నిరూపించుకోవాలంటూ సీనియర్ నాయకులు చెబుతుండటం చూస్తే రేవంత్ మీద వారికి వ్యతిరేకత ఏ రేంజ్ లో వుందో తెలుస్తోంది. ప్రస్తుత పరిస్దితుల బట్టి చూస్తే పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి వెనుకబడి వున్నట్లే. మరి ఈ పదవి కోమటి రెడ్డి వెంకటరెడ్డి  కి వస్తుందా లేదా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.