కాసేపట్లో మారుతీరావు అంత్యక్రియలు..!

post

హైదరాబాద్‌లోని​ఆర్యవైశ్య భవన్​లో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన మిర్యాలగూడ వాసి, ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి.స్వగృహానికి చేరుకున్న మృతదేహాన్ని చూసి ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంతగానో విలపించారు. పట్టణానికి చెందిన పలువురు మారుతీరావు నివాసానికి చేరుకొని నివాళులు 
అర్పించారు. అయితే మారుతీ రావు కూతురు అమృత కాసేపట్లో తండ్రి మృత దేహాన్నిచూడటానికి రానున్నారు. అయితే తనకు పోలీసులు భద్రతను కల్పించాలిన ఆమె కోరినట్లుగా తెలుస్తోంది.ఆమె రాకను మాత్రం మారుతీరావు కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.