హోలీ నాడు మధ్యం బంద్..!

post

జంటనగరాల్లో హోలీ పండగను పురస్కరించుకుని ఈనెల 9వ తేదీ నుంచి రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని నగర పోలీస్‌కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశించారు. హోలీపండగ నేపధ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని మద్యం, కల్లు దుకాణాలు, బార్‌అండ్‌ రెస్టారెంట్‌లు 9వ తేదీ ఉదయం 6గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6గంటల వరకు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఆదేశించారు. 
 హోలీ పండగ సందర్భంగా యువతీ యువకులురోడ్లపై రంగులు ఆడినా కఠిన చర్యలు తప్పవని పోలీస్‌కమిషనర్‌ అంజనీ కుమార్‌  తెలిపారు.యువతీ యువకులు  బైక్‌లపై గుంపులుగా వెళ్లడం, రోడ్లపై వెళ్లేవారి మీద రంగులు చల్లడం, పబ్లిక్‌ప్లేస్‌లో హోలీ ఆడడం, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారిపైకఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఈనెల 9వ తేదీ ఉదయం 6గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6గంటల వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని అన్నారు. నిబందనలు ఉల్లింఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు