తెలంగాణ మంత్రి కూడా.. లాఠీ పట్టుకుని..!

post

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, చాల మంది ప్రజలు ప్రభుత్వం  విధించిన నియమాలను పట్టించుకోకుండా రోడ్ల మీద కు వస్తున్నారు. దీనితో పోలీసులు లాఠీ లకు పనులు చెబుతున్నారు.ఇది పలుచోట్ల విమర్శలకు తావిస్తున్నది. ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, మరోవైపు ప్రధానమంత్రి కూడా చేతులెత్తి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపధ్యం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత నాయకులకు, అధికారులకు, పోలీసులకు ఉందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
      ఇంత చేస్తున్న, ఇన్ని ఆంక్షలు విధిస్తున్నా కొంత మంది ప్రజలు బయటకు రావడం మానలేదు. ఇప్పటికే పోలీసులు పలుచోట్ల ప్రధాన కూడళ్ల వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. కొంత మేర తగ్గినా, ఇంకా అక్కడక్కడా కొంత మంది రోడ్లపై తిరుగుతూ కనిపిస్తున్నారు. లాక్ డౌన్ ను విజయవంతం చేసే ఉద్దేశం తో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా తన అనుచరులతో మహబూబ్ నగర్ రోడ్ల మీద కు వచ్చారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న కొందరు యువకులను పట్టుకుని లాఠీలతో బెదిరించారు. మొదటి సారి కాబట్టి వదిలేస్తున్నామని, మరోసారి కనిపిస్తే దండన తప్పదని చెప్పుకొచ్చారు .పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన వార్నింగ్ ఇచ్చారు.