రోడ్డునపడ్డ హైదరాబాద్ బ్యాచిలర్స్..!

post

తెలంగాణాలో కూడా ఇరవై ఒక్క రోజులు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా, సాయంత్రం ఏడూ గంటలనుంచి తిరిగి ఉదయం ఆరు గంటలవరకు బయటకు రావడానికి లేకుండా కర్ఫ్యూ విధించారు. దీనితో హైదరాబాద్ హాస్టల్స్ లో ఉంటున్న బ్యాచిలర్స్ పరిస్థితి దారుణం గా తయారైంది. తినడానికి ఫుడ్ దొరక్క అల్లాడిపోతున్నారు. బయటకు రాలేక ఆకలి కి తట్టుకోలేకపోతున్నారు.
       ఇప్పటికే పలు హాస్టల్స్ ను క్లోజ్ చేసారు. ఒకటి అరా నడుస్తూ ఉన్నా వాటిని కూడా బలవంతం గా క్లోజ్ చేయాలనీ ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల యువతీ యువకుల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వీరంతా ఏమి చేయాలో పాలుపోక పోలీస్ స్టేషన్ల వద్ద బారులు తీరుతున్నారు. ఊరు వెళ్ళడానికి అనుమతులు ఇవ్వాలి అంటూ మొత్తుకుంటున్నారు. పోలీసులకు కూడా ఈ  సమస్యను ఎలా సాల్వ్ చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుని కూర్చున్నారు. అందరిని ఒకేసారి ఊరు పంపేలా పాస్ లు ఇస్తే బాగుంటుంది అని తొలుత భావించినా, పాస్ లు ఇచ్చినా వీరు ఊరు ఎలా వెళ్తారని ఆలోచనలో పడ్డారు.