తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్ డౌన్..!

post

దేశవ్యాప్తం గా ఇరవై ఒక్క రోజులు లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మేరకు అన్ని నగరాల్లోనూ పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. పోలీసులు రోడ్లపై తిరుగుతూన్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపిస్తున్నారు. ఎవరిని సరైన కారణం లేకుండా బయటకు తిరగడానికి అనుమతించడం లేదు. ఇప్పటికే  ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు లు కూడా మూసి వేసిన సంగతి తెలిసిందే. గ్రామాల్లో కూడా సరిహద్దు లను మూసివేసి ప్రయాణాలు మానుకోవాలని కెసిఆర్ సూచించిన సాగండి తెలిసిందే. గ్రామాల్లో ప్రజలు కూడా దీనికి స్వచ్చందం గా సహకరిస్తున్నారు.చాల మంది ప్రజలు ఈ లాక్ డౌన్ నేపధ్యం లో ఇళ్లనుంచి బయటకు రావడం లేదు.
      తాజాగా, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావడం జరుగుతోంది. వీరు పోలీసులకు సహకరించకుండా వారితో వాగ్వాదాలకు దిగుతున్నారు. దీనితో పోలీసులు కూడా అసభ్య పదజాలం తో దూషిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. ఈ విషయం పై, ఈరోజు మధ్యాహ్నం జరిగిన ప్రెస్ మీట్ లో కెసిఆర్ స్పందించారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. ప్రజల కోసమే ఇదంతా చేస్తున్నామని, మీరు బాగుండాలనే మేము కోరుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. మీడియా మరియు ఇతర అత్యవసర సేవలకు మాత్రం ఉద్యోగులకు అనుమతి  ఉందని ఇతర వర్గాల ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలని కెసిఆర్ సూచించారు.