కరీం నగర్ లో దారుణం..!

post

కరోనా వైరస్ వల్ల దేశం తలకిందులైంది. మానవత్వం మనుగడ సాగించే దేశం లో కూడా ఉహించరానటువంటి ఘటన చోటు చేసుకుంది. తాజాగా, కరీం నగర్ లో ఓవ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అయితే, కరోనా వైరస్ వల్ల భయం తో ఎవరు అతని దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా సాహసించలేదు. ఆ జిల్లాలోని  ఇండోనేషియా వాసులకు కరోనా వైరస్ సోకినా సంగతి తెలిసిందే. దీనితో, అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపధ్యం లో ఎక్కడినుంచి వచ్చి కరోనా సోకుతుందో అనే భయం లో ఉన్నారు. 
    కరీం నగర్ జిల్లా లో కాశ్మిర్ గడ్డ రైతుబజార్ కు ఓ వ్యక్తి కూరగాయలు కొనుక్కోవడం కోసం వచ్చారు. కొనుక్కుంటాన్న టైం లోనే అతనికి గుండెపోటు రావడం తో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులెవరు అతని మృతదేహం వైపు రాలేకపోయారు.చివరకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.