ఇప్పుడేం చెప్పలేను...:గంగూలీ 

post

ఓ వైపు కరోనా మహమ్మారి దేశం లో విలయం సృష్టించింది. బయటకు రావడానికి జంకే పరిస్థితి నెలకొంది. ఈ సమయం లో ఇంకా ఆటలాడటానికి ఎవరు వస్తారు. చివరకి వేలకోట్లు వెచ్చించి  ఏర్పాట్లు చేసిన ఒలంపిక్స్ క్రీడలను కూడా నిలిపివేశారు. ప్రపంచవ్యాప్తం గా జరగాల్సి ఉన్న ఇతర క్రీడలు కూడా వాయిదా పడ్డాయి. అయినా కూడా, ఐపీఎల్ లీగ్ విషయం లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటివరకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. వాయిదా గురించి ఇప్పటికీ నాన్చుడు ధోరణి లో మాట్లాడినట్లు తెలుస్తోంది.ఇటీవల ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, " ఇప్పుడు నేను ఏమి చెప్పలేను. లీగ్ ను వాయిదా వేసిన సమయం నుంచి ఇప్పటివరకు పరిస్థితి ఏమి మారలేదు. కాబట్టి నా దగ్గర సమాధానం లేదు" అని ఆయన చెప్పుకొచ్చారు.
         ప్రభుత్వమే లాక్ డౌన్ ప్రకటించిన విపత్కర పరిస్థితి దేశం లో నెలకొని ఉందని అన్నారు. ఈ సమయం లో బీమా సొమ్ము కూడా వచ్చే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మరో మూడు నెలల తరువాత ఐన ఈ లీగ్ నిర్వహించే అవకాశం లేదని ఆయన అన్నారు. ఇదివరకే భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ) ఖరారు అయ్యిందని, అది మార్చడం సాధ్యం కానీ పని అని ఆయన అన్నారు. ప్రభుత్వం కోరితే ఈడెన్‌ గార్డెన్‌ ఇండోర్‌ సదుపాయాల్ని వైద్య అవసరాల కోసం ఇచ్చేందుకు సిద్ధం గానే ఉన్నామని ఆయన తెలిపారు. 
         కాళీమాత ఆశీస్సులతో నిత్యం రద్దీ గా ఉండే కోల్కతా ప్రస్తుతం ఖాళీ గా ఉంది. గంగూలీ మాట్లాడుతూ మా కోల్కతా ను ఇలా చూస్తామని ఎపుడూ అనుకోలేదని అన్నారు.ఈ పరిస్థితి తొందరలోనే మెరుగవుతుందని అన్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ అందరిపై నా ప్రేమాభిమానాలు ఉంటాయని ఆయన తన ట్విట్టర్ లో తెలిపారు.