ఇదొక చెత్త వైరస్..!

post

ప్రపంచాన్ని  వణికిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి ఆటగాళ్లు కూడా తప్పించుకోలేకపోతున్నారు.  ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ దక్షిణాఫ్రిక స్విమ్మర్ కామెరాన్ వాన్ డెర్ బర్గ్ కరోనా  కు బలి అయ్యారు. ఈ నేపధ్యం లో ఆయన ట్విట్టర్ లో స్పందించారు.తానూ గత పదునాలుగు రోజులు గా కరోనా వైరస్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇది ఇప్పటి వరకు ఎదుర్కొన్న వాటిల్లో చెత్త వైరస్ అని అన్నారు. తాను ఫిజికల్ గా ఫిట్ గానే ఉన్నానని, కానీ ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపిస్తోందని అన్నారు. కరోనా వల్ల వచ్చిన తీవ్ర జ్వరం తగ్గిందని, కానీ కదలడం కష్టం గా ఉందని అన్నారు. కొద్దీ  దూరం నడిస్తే, గంటలకొద్దీ అలసట వస్తోందని  ఆయన అన్నారు. అంతేకాకుండా, తీవ్రం గా దగ్గుతో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు.