మతాలతో కాదు... మనుషులుగా బతకాల్సిన సమయమిది..!

post

కరోనా వైరస్ ప్రబలుతున్న సమయం లో...అన్ని దేశాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపధ్యం లో దుకాణాలు అన్ని బంద్ అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలుగా, ప్రజలు సరుకులు ముందుగానే తీసుకుని నిల్వ చేసుకుంటున్నారు. ఈ సమయం లో పేదల గురించి కూడా ఆలోచించాలని, నిల్వలు చేయడం మాని, మాములు మనుషుల్లా జీవించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సూచిస్తున్నారు. కరోనా వైరస్ ప్రపంచ సంక్షోభం అని, ఈ కష్టకాలం లో మనమంతా ఒకరినొకరు సాయం చేసుకోవాలని ఆయన తన అభిమానులను కోరుతున్నారు. ఈ సమయం లో ఐకమత్యం తో కలిసి ముందుకెళ్లాలని ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడినపుడు చెప్పారు. 
     ఈ ప్రపంచ సంక్షోభ సమయం లో మనమంతా ప్రపంచ  శక్తి గా అవతరించాలని ఆయన తన అభిమానులను ఉద్దేశించి  అన్నారు. మీరు ఒకరినొకరు కలుస్తూ, సమూహాలుగా తిరిగితే వైరస్ ను అరికట్టలేమని ఆయన చెప్పారు. దుకాణాలన్నీ మూతబడ్డాయని, మీరు నిల్వ చేసుకుని ఉంటె...మీ చుట్టూ ఉండే పేదవారి గురించి ఆలోచించమని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ పరిస్థితి ఇలానే ఉంటె..ఓ మూడు నెలల తరువాత అందరి గతి ఏమిటని ప్రశ్నించారు. అందుకే డబ్బు, వస్తువులకన్నా, మనుషులుగా సాటి మనుషుల కోసం ఆలోచించమని ఆయన కోరారు. అంతేకాని, మనమధ్య అంతరాలు ఉండకూడదని ఆయన కోరారు.