రంజీ విజేత సౌరాష్ట్ర..!

post

సౌరాష్ట్ర క్రికెట్‌ జట్టు తొలిసారి  రంజీ ట్రోఫీ గెలుచుకుని చరిత్ర సృష్టించింది.  2019-20 సీజన్‌లో భాగంగా  సౌరాష్ట్ర, బెంగాల్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ శుక్రవారం డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన జట్టుకే రంజీ ట్రోఫీ దక్కడం అందరికీ తెలిసిందే.   సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా.. ప్రత్యర్థి బెంగాల్‌  381 రన్స్‌ మాత్రమే చేసింది. ఫలితం తేలకపోవడంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం(44 పరుగులు) సాధించిన సౌరాష్ట్ర విజేతగా నిలిచింది.    
   టైటిల్‌ కోసం ఎన్నోఏళ్లుగా  నిరీక్షించిన సౌరాష్ట్ర ఎట్టకేలకు జయదేవ్‌ ఉనద్కత్‌ నేతృత్వంలోని జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. టైటిల్‌ గెలిచిన ఆనందంలో సౌరాష్ట్ర ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. జట్టు వెనుకబడిన సమయంలో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మన్‌ అర్పిత్‌ వసవాడ(106) శతకంతో అదరగొట్టగా..టెస్టు స్పెషలిస్ట్‌(66) అర్ధశతకంతో ఆకట్టుకోవడంతో సౌరాష్ట్ర భారీ స్కోరు చేయగలిగింది.  1989-90 సీజన్‌లో బెంగాల్‌ టైటిల్‌ సాధించింది. 30ఏండ్ల తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలువాలన్న బెంగాల్‌ ఆశనెరవేరలేదు.