ఐపీఎల్ ను అడ్డుకోవాలి...!

post

ఓవైపు ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. మరోవైపు కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే కరోనా పై దేశ వ్యాప్తంగా అందోళన నెలకొనడం , పలు రాష్ట్ర్ర ప్రభుత్వాలు దీనికి నివారణ చర్యలు ప్రారంభించడం జరుగుతోంది. ఈ నేపధ్యం లో ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా? వాయిదా పడుతుందా? అనే అనుమానం క్రికెట్ అభిమానుల్లో మొలకెత్తుతోంది. ఈ విషయం పట్ల సౌరవ్ గంగూలీ క్లియర్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఐపిఎల్ జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ,క్రీడా శాఖ లమధ్య సమావేశం జరిగిన తరువాత దీనిపై క్లారిటీ వస్తుందని  భావించారు.

     ఇది ఇలా ఉంటె, మరోవైపు ఐపిఎల్ ను అడ్డుకోవాలంటూ చెన్నై కు చెందిన ఓ న్యాయవాది మద్రాసు హైకోర్టు లో పిటిషన్ వేశారు. నిజానికి, ఈనెల 29 నుంచి ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉంది. ముంబైలోని వాంఖడేలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, గత సీజన్ ఫైనలిస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ పాడటానికి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపధ్యం లో చెన్నై కోర్టులో ఓ న్యాయవాది ఈ పోటీలను అడ్డుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేసారు.

      ఇప్పటికే అనేక క్రీడా పోటీలు వాయిదా పడుతూ వస్తున్నాయి.  మలేసియా లో ప్రతి ఏడూ జరిగే అజ్లాన్ షా హాకీ టోర్నీ కూడా ప్రస్తుతానికి వాయిదా పడింది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ అంటువ్యాధిలా వ్యాపిస్తోంటే, ఇలాంటి పరిస్థితిల్లో ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవాలని మద్రాసు హైకోర్టును ఆ న్యాయవాది జి. అలెక్స్ బెంజిగర్ మద్రాస్ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ రేపు విచారణకు రావచ్చు అని తెలిపారు. కాగా, కరోనా వైరస్ కు ఇంకా మందు కనుక్కున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించలేదని ఆయన పేర్కొన్నారు.