కరోనా ఎఫెక్ట్ ఐపీఎల్ పై పడుతోందా..?

post

కరోనా వైరస్ అంతకంతకు విస్తరిస్తూ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. ఐతే, ఈ నేపధ్యం లో ఈ వైరస్ ప్రభావం జరగనున్న ఐపిఎల్ పై పడబోతోందన్న ఊహ సర్వత్రా నెలకొంది. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచం లోకెల్లా అత్యంత ఖరీదైన ఐపీఎల్ గా గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ప్రస్తుతం కరోనా వైరస్ కారణం గా ఐపిఎల్ ప్రారంభం అవుతుందా? లేదా? అన్న సందిగ్ధం లో ఉంది.

అదుపులోకి వస్తుందా..?

    ఒక కేసుతో మొదలై క్రమం గా ముప్పై కేసులకు చేరుకుంది కరోనా వైరస్. ఒక కేసు తెలంగాణ లో కాగా, మరో ముప్పై కరోనా పాజిటివ్ కేసులు దేశ రాజధాని ఢిల్లీ లో నమోదు అయ్యాయి. ఈ నేపధ్యం లో భారత ప్రభుత్వం కరోనా వైరస్ పై అదుపు సాధించగలదా? వ్యాప్తిని అరికట్టి, కేసులను అదుపులో ఉంచగలదా? అనేది అందరికి సందేహమే.

ఐపీఎల్ పరిస్థితేంటి...?

     ఇండియన్ క్రికెట్ లీగ్ సీజన్ ఈ నెల 29 న జరగాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యం లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అన్న సంకట స్థితి క్రికెట్ రంగం లో నెలకొంది. ఐపీఎల్ ప్రారంభం అయ్యే సమయానికి కరోనా వైరస్ అదుపులోకి వస్తుందా? అనేది ఇప్పటికి సమాధానం లేని ప్రశ్నయే.

హాకీ టోర్నీ కూడా వాయిదా..!

     ఇప్పటికే అనేక క్రీడా పోటీలు వాయిదా పడుతున్నాయి.  మలేసియా లో ప్రతి ఏడూ జరిగే అజ్లాన్ షా హాకీ టోర్నీ ప్రస్తుతానికి వాయిదా పడింది. నేపాల్ లో జరగాల్సిన ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు సైతం కరోనా వైరస్ తో బ్రేక్ పడింది. ఈ పోటీలను రీ షెడ్యూల్ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి, ఐపీఎల్ సీజన్ ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ అంటే కొన్ని వేలమంది స్టేడియం కు వస్తారు. ఆ సమయం లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కష్టతరమవుతుంది. ఓవైపు ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లతో సన్నాహాలు చేస్తున్నాయి. కానీ మరోవైపు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధీమా గానే ఉన్న, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే దానిపై అందరు ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు.