టి-20 ప్రపంచకప్ లో ఫైనల్ కు భారత్..!

post

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తొలిసారి ఫైనల్‌ చేరింది. నేడు భారత్‌ X ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్‌ వర్షం కారణంగా రద్దు అయ్యింది. దీంతో  లీగ్  దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన హర్మన్‌ప్రీత్‌సేన సెమీస్‌ ఆడకుండానే నేరుగా ఫైనల్‌ చేరింది.. ప్రస్తుత టోర్నీలో టీమ్‌ఇండియా గ్రూప్‌-ఎలో వరుసగా నాలుగు లీగ్ మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్‌ 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో సెమీఫైనల్స్‌లో టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌తో తలపడాల్సి వచ్చింది.