సగం సగం తెలుసుకుని రాకండి..జర్నలిస్ట్ పై కోహ్లీ ఫైర్...!

post

మ్యాచ్ పూర్తైన తరువాత జరిగిన మీడియా సమావేశం లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జర్నలిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఆదివారం రెండో సిరీస్ లో కివీస్ కెప్టె విలియమ్సన్ అవుట్ అయ్యాడు. ఆ సమయం లో, కోహ్లీ ప్రేక్షకుల వైపుకు తిరిగి 'కీప్ క్వయిట్' అని సంజ్ఞలు చేసాడు. ఐతే, ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయి విమర్శలకు తావిచ్చింది. దీనితో ఓ లోకల్ జర్నలిస్ట్ విరాట్ స్పందనను అడిగే ప్రయత్నం చేసాడు. వెంటనే మీరేమనుకుంటున్నారు అని విరాట్ ఎదురు ప్రశించాడు. సదరు జర్నలిస్ట్ ఖంగుతిని, మీ అభిప్రాయాన్ని అడిగితే, మీరు తిరిగి ప్రశ్నించడమేంటని అన్నారు. మీరు మైదానం లో సరిగా ప్రవర్తించి ఉండాల్సింది అని బదులిచ్చారు. దీనితో, విరాట్ కోహ్లీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్కడ ఏమి జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా, అసంపూర్తి సమాచారం తో ఇక్కడకి రాకూడదని స్పందించారు. మీరు వివాదాలు సృష్టించదలుచుకుంటే అందుకు ఇది వేదిక కాదని చెప్పుకొచ్చారు.