సచిన్ సరసన పృధ్వీషా

post

టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ పృథ్వీషా సచిన్‌ తెందూల్కర్‌ తర్వాత న్యూజిలాండ్‌లో అర్ధశతకం అందుకున్న పిన్న వయసు కలిగిన ఆటగాడుగా  రికార్డు కెక్కాడు.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో షా 64 బంతుల్లో 54 పరుగులు చేశాడు. వీటిలో  ఎనిమిది బౌండరీలు, ఒక సిక్సర్‌  వున్నాయి.ప్రస్తుతం షా వయసు 20 ఏళ్ల 112 రోజులు. అంతకన్నా ముందు సచిన్‌ తెందూల్కర్‌ న్యూజిలాండ్‌ గడ్డపై అర్ధశతకం అందుకున్న పిన్న యవస్కుడిగా ఘనత అందుకున్నారు. 1990లో నేపియర్‌లో 16 ఏళ్ల 293 రోజుల వయసప్పుడు అర్ధశతకం సాధించారు.