హెచ్‌పీసీఎల్‌ లోను ప్రమాదం.. ఎల్జీ పొలిమెర్స్ ఘటన నేర్పని పాఠం..!

post

లాక్ డౌన్ కారణం గా ఇన్నిరోజులు పరిశ్రమలు మూత పడ్డ సంగతి తెలిసిందే . అయితే లాక్ డౌన్ ను  సడలిస్తున్న నేపధ్యం లో క్రమం గా అన్ని తిరిగి తెరుచుకుంటున్నాయి. అయితే.. సరైన జాగ్రత్తలు తీసుకోని కారణం గా పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎల్జీ పొలిమెర్స్ ఉదంతం తెలిసిందే. అయితే.. ఈ ఘటన ఇప్పటికి పాఠం నేర్పలేదు. ఫలితం గా విశాఖపట్టణం లో మరో పరిశ్రమ లో ప్రమాదం చోటు చేసుకుంది. హెచ్‌పీసీఎల్‌ కంపెనీ నుంచి పొగలు వెలువడడం తో ఒక్కసారిగా అందరు షాక్ తిన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌లో వున్న భారీ పరిశ్రమల్లో ప్రమాదానికి ఆస్కారం వున్న వ్యవస్థలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలంటూ టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని నియమించింది. వారంతా పది రోజులుగా అదే పనిలో ఉన్నారు. అయినా హెచ్‌పీసీఎల్‌ నుంచి ప్రజల్ని భయకంపితుల్ని చేసే పొగలు వచ్చాయి. 
        దీనితో... కంపెనీ యాజమాన్యం గాని.. టాస్క్ ఫోర్స్ కమిటి సభ్యులుగాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. హెచ్‌పీసీఎల్.. విశాఖపట్నం లోనే పెద్ద కంపెనీ.. ఇక్కడ ప్రమాదాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ కంపెనీ ది పెట్రో కెమికల్‌ యూనిట్. యాభై రోజుల తరువాత తిరిగి ప్రారంభిస్తున్నారంటే... ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎల్జీ పొలిమెర్స్ తరహా లోనే నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో దట్టంగా పసుపు రంగు పొగలు వచ్చాయి. దీనితో.. ప్రజలు భయకంపితులయ్యారు. హెచ్‌పీసీఎల్‌ నుంచి గురువారం వెలువడిన దట్టమైన పొగలపై విచారణ చేయడానికి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ రాజేంద్ర రెడ్డి శుక్రవారం ఇక్కడకి చేరుకుంటారని సమాచారం.