లాక్ డౌన్ గందరగోళం..వందలాది మందికి ఒకేసారి కరోనా పరీక్షలు..!

post

అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడం తో తెలుగు రాష్ట్రాల్లో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే పలు హాస్టల్స్ ను మూసివేసిన సంగతి తెలిసిందే. ఇతర హాస్టల్స్ ను కూడా మూసివేయడం తో వాటిలో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరం గా మారింది. వీరంతా ఏపీ విద్యార్థులే. వీరంతా పోలీస్ స్టేషన్ల బాట పట్టారు. తమకు ఇళ్లకు వెళ్లే అనుమతి ఇవ్వాలంటూ కోరారు. అనుమతులు తీసుకుని, కొంతమంది బైక్ లపై, కార్లపై రోడ్డులెక్కారు. వీరందరిని గరిక పాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు రోజంతా వీరు రోడ్డు పైనే నిలిచిపోయారు. మా రాష్ట్రము లోకి రావద్దంటూ వారు అడ్డుకున్నారు. పోలీసుల అనుమతి ఉందంటూ వీరెంత మొత్తుకున్నా వారు వినిపించుకోలేదు.

అర్థరాత్రి వరకు...!

వారు వెళ్లనివ్వకపోవడం తో అర్థరాత్రి వరకు విద్యార్థులంతా రోడ్లపై నిలిచిపోయారు. సుమారు రెండువేలమందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మరికొందరు ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఉన్నారు. వీరంతా రోడ్డు పై ఒకే చోట గుంపులు గా ఉండడం తో పోలీసులకు ఏమి చేయాలో తోచలేదు. తెలంగాణ పోలీసులు అనుమతులు ఇచ్చారని తమను ఇళ్లకు పంపాలని వారంతా పట్టుబట్టారు

 .

 

కేటీర్ ట్వీట్..!

పరిస్థితి తెలిసిన వెంటనే కేటీర్ చేసారు. ఇరు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకే చోట గుమికూడటం వల్ల కరోనా వైరస్ ముప్పు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించి, ఈ విషయమై కెసిఆర్ ఏపీ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడారు అని ఆయన తెలిపారు. సమస్య పరిష్కారం అవుతుందని కూడా ఆయన చెప్పారు.

చలో క్వారంటైన్...!

వీరందిరిని క్వారంటైన్లకు తరలించాల్సింది గా కెసిఆర్ సూచించారు. అందరిని వేరు వేరు క్వారంటైన్లకు తరలించారు. ఈ బాధ్యతను వైస్ జగన్ కు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అప్పగించారు.వైద్య పరీక్షలు నిర్వహించకు ఇళ్లకు పంపించాలన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలవారిని నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్లకు, తూర్పుగోదావరి జిల్లావారిని రాజమండ్రి క్వారంటైన్‌కు, పశ్చిమగోదావరి జిల్లావారిని తాడేపల్లిగూడం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించారు.

1902కు కాల్‌ చేయ్యండి..!

హైదరాబాదు లో ఉంటున్నఎపి విద్యార్థులు ప్రైవేట్ ఉద్యోగులను ఎక్కడివారిని అక్కడే ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిస్తూన్న నేపధ్యం లో ఎవరు బయటకు రావద్దు అని వారిని కోరింది. ఏమైనా సమస్యలు ఎదురైతే 1902 కి కాల్ చేయమని కోరింది.