రోడ్డెక్కారంటే..బండి సీజ్..!

post

ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపధ్యం లో ఎవరు బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండలను పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ చాల మంది ప్రజలు ప్రభుత్వం చేసినా సూచనలను పెడచెవిన పెడుతున్నారు. బండి తీసుకుని రోడెక్కుతున్నారు. ఈ నేపద్యం లో పోలీసులు రోడ్లపై పహారా కాస్తున్నారు. ఎవరైనా కనిపిస్తే వెనక్కి పంపిస్తున్నారు. క్యాబ్ మరియు ఆటో డ్రైవర్లను మందలించి అందులో ఎక్కిన ప్రయాణికులను కూడా వెనక్కి పంపిస్తున్నారు. లాక్ డౌన్ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన మైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.
    ఈరోజు మధ్యాహ్నం పోలీసులు రంగప్రవేశం చేసి..రోడ్లపై కనిపిస్తున్న వాహనాలను సీజ్ చేసారు. వారిని మందలించి తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అనవసరం గా రోడ్లపైకి వచ్చే వారితో పోలీసులు కఠినం గా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల భారీగా ఫైన్లు వేస్తున్నారు. ఒకసరి సీజ్ చేసినా వాహనాలను లాక్ డౌన్ పూర్తయ్యేవరకు ఇవ్వమని  చెప్పుకొచ్చారు. ప్రజలు స్వచ్చందం గా లాక్ డౌన్ ను పాటించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. నిత్యావసరాలు కూడా సాయంత్రం ఏడు లోపు తెచ్చుకోవాలని, మరీ అత్యవసరమైన స్థితి ఉంటె తప్ప బయటకు రావద్దని తెలంగాణ డీజీపీ మహేందర్ కోరారు. సాయంత్రం 7 నుంచి తిరిగి ఉదయం ఆరుగంటలవరకు అన్ని దుకాణాలు మూత పడతాయని ఆయన చెప్పుకొచ్చారు. బైక్‌పై ఒకరికి, కారులో ఇద్దరికి మాత్రమే బయటకు వెళ్లే అనుమతి ఉన్నట్లు ఆయన తెలిపారు.