మార్ఫింగ్ ఫోటోలు చూసి పొంగిపోతున్న ఇవాంకా..!

post

 

      అమెరికా ట్రంప్ పర్యటన ముగిసి రోజులు గడుస్తున్నా ఇంకా ఆ తీపి జ్ఞాపకాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. మొన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా 'ఈ పర్యటన తనకెంతో ప్రత్యేకమైనదని, జీవితాంతం గుర్తుంచుకుంటానని, అంతమంది తనకోసం రావడం ఎక్సయిటింగ్ గా ఉందని' చెప్పుకొస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇవాంక కూడా భారతీయుల స్నేహం పట్ల హర్షం వ్యక్తం చేసారు.

మనోళ్ళ ఫోటోషాప్ టెక్నిక్ కి ఇవాంక ఫిదా..!

     ప్రెసిడెంట్ ట్రంప్ పర్యటన సందర్భం గా వారు దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజ్ మహల్ వద్ద దిగిన ఫోటోలు భారతీయులను విశేషం గా ఆకట్టుకున్నాయి. ఇంక ఆలస్యమేముంది...మనోళ్లు ఫోటోషాప్ పనిలో పడ్డారు. ఇవాంక పక్కన తాము నుంచున్నట్లు గా, ఇవాంక ను సైకిల్ ఎక్కించుకున్నట్లు గా... ఇలా రకరకాలుగా ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ లో పెట్టారు. అంతేకాకుండా వారు ఇవాంక ను టాగ్ చేసి ఈ ఫోటోలను పెట్టడం తో ఆమె వీటిని చూసి పాజిటివ్ గా స్పందించారు. తనపై చూపిస్తున్న అభిమానానికి పొంగిపోతున్నట్లుగా ఆమె తన ట్వీట్ లో తెలిపారు. ఇంకా, భారత ప్రజలు తనని టాగ్ చేసిన మరిన్ని ఫోటోలను షేర్ చేస్తూ, 'మీ అభిమానానికి పొంగిపోతున్నా.. నాకు మరింతమంది ఫ్రెండ్స్ దొరికారు..' అంటూ ట్వీట్ చేసారు.

సెలెబ్రిటీలు కూడా..!

     తాజాగా, ప్రముఖ గాయకుడు దిల్జీత్ దొసాంజ్ తన భార్యతో దిగిన ఫోటోను మార్ఫింగ్ చేసి తన భార్య ప్లేస్ లో ఇవాంక ఫోటోను పెట్టారు. ఈ ఫోటో ను కూడా ట్విట్టర్ లో షేర్ చేసి ఇవాంకను  టాగ్ చేసారు. ఈ ఫోటో పై ఇవాంక స్పందిస్తూ, నన్ను అద్భుతమైన తాజ్ మహల్ కు తీసుకువెళ్ళినందుకు థాంక్స్ దిల్జీత్ దొసాంజ్ అని రిప్లై ఇచ్చారు. ఇంక, ఆ ట్వీట్ ను రీట్వీట్ చేసిన 'ఆదిత్య చౌదరి' అనే జర్నలిస్టును ట్వీట్ కు స్పందనగా, 'మీరు ఆలస్యమయ్యారు పాజి' అంటూ మరికొన్ని ఫొటోస్ ను షేర్ చేసారు.

మా ఇవాంక బంగారం..!

     సాధారణం గా సెలెబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేస్తే వారు ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తారు. కానీ ఇవాంక అవేమి పట్టించుకోకుండా, సానుకూలం గా..సరదాగా..స్పందించడం పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఇవాంక బంగారం అని మురిసిపోతున్నారు.