పదినిమషాల్లో పెళ్లి … తరువాత డ్యూటీకి..!

post

 

చైనా షాన్‌డాంగ్‌లోని హెజె ప్రాంతానికి చెందిన లి జిక్వింగ్… షాన్‌డాంగ్ యూనివర్శిటీ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు. ‘కరోనా’ బయటపడక ముందే అతడికి వివాహం నిశ్చమైంది. దీంతో జనవరి 30న పెళ్లి జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. ‘కరోనా’ తీవ్రత అధికంగా ఉండడంతో రోగులకు చికిత్స అందించడంలో ఆయన నిమగ్నమయ్యాడు. ఈ పరిస్థితుల్లో వధూవరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వివాహాన్ని వాయిదా వేయకూడదని నిర్ణయించుకున్నారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో కేవలం పది నిమిషాల్లో వివాహ తంతును ముగించారు. ఆ తర్వాత వరుడు లి జిక్వింగ్ యథావిధిగా తన విధులకు హాజరయ్యాడని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. రోగులకు చికిత్స అందించడం కోసం జీవితంలో ఎంతో కీలక ఘట్టాన్ని త్వరగా ముంగించుకొని వృత్తి ధర్మానికి కొత్త నిర్వచనం చెప్పినందుకు అతడిని పలువురు అభినందించారు. అందుకు అంగీకరించిన వధువు యు హోంగ్యాన్‌ను కూడా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.