'ఉన్నావ్' కేసు నిందితుడి కి ఉరి..!

post

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే, 'ఉన్నావ్' కేసు లో ప్రధాన నిందితుడి కులదీప్ కు ఉరి శిక్ష ఖరారైంది. గురువారం కోర్టు లో జరిగిన విచారణ లో కులదీప్ తన వాదనను తానే వినిపించుకున్నాడు. కాగా, అతని వాదనలను కోర్టు లెక్క చేయలేదు. విచారణ ముగిసిన తరువాత, ఉన్నావ్ కేసులో బాలికపై అత్యాచారం చేసి, ఆమె తండ్రిని చంపిన నేరానికి కోర్టు అతనికి ఉరి శిక్ష విధించింది.

తప్పు చేసుంటే నా కళ్ళల్లో యాసిడ్ పోయండి..!

ఢిల్లీ  కి చెందిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ 2017 లో ఉన్నావ్ కు చెందిన ఓ బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను జీవిత ఖైదు ను అనుభవిస్తున్నాడు. జైలు లో ఉంటూ, బాలిక తండ్రిని కూడా పోలీసుల సాయం తో హతమార్చాడని అతనిపై ఆరోపణలున్నాయి. అయితే, బాలిక తండ్రిని హతమార్చిన కేసు లో కూడా అతనే దోషి అని ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది. వాస్తవానికి, మార్చి 4న ఈ కేసులో తీర్పు చెప్పిన న్యాయస్థానం శిక్ష ఖరారు చేయవలసి వున్నది. కేసు వాయిదా పడటం తో, గురువారం ఈ కేసు తాలూకు వాదనలు జరిగాయి. కాగా, కులదీప్ సింగార్ లాయర్ వద్దంటూ, తన కేసు ను తానే వాదించుకున్నారు. బాలిక తండ్రి హత్య కేసు లో తనకేమి సంబంధం లేదని, ఒకవేళ తాను తప్పు చేసి ఉంటె తనకు ఉరి శిక్ష ఖరారు చేయమని, లేదా తన కళ్ళలో ఆసిడ్ పోయామని వాదిస్తున్నారు. గా, అతని వాదనలను ఢిల్లీ కోర్టు పట్టించుకోలేదు. ఈ హత్య కేసులో అతడి ఇన్‌వాల్వ్‌మెంట్‌పై సీబీఐ స్పష్టమైన ఆధారాలను సేకరించిందని, పోలీసులు కూడా  ఇందులో భాగస్వామ్యం కావడం ఘోరమైన చర్యగా కోర్టు అభివర్ణించింది. కుట్రలతో పొలిసు కస్టడీ లోనే బాలిక తండ్రిని హత్య చేశారనడానికి సాక్ష్యాలున్నాయని, బాధితులను కాపాడాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడం దారుణం అని అన్నారు.

        రేప్ బాధితురాలి తండ్రి, అతడి తోటి ఉద్యోగులు 2018 ఏప్రిల్ 3న పని ముంగించుకుని ఇంటికి వెళ్తుండగా శశి ప్రతాప్ సింగ్ అనే అతడిని లిఫ్ట్ అడిగారు. అయితే కావాలని ప్లాన్ ప్రకారమే అక్కడికి వచ్చిన అతడు వారికి లిఫ్ట్ ఇవ్వడానికి నిరాకరించి.. ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగాడు. గొడవ జరుగుతున్న సమయం లో కులదీప్ సింగర్ తమ్ముడి తో కలిసి అక్కడకి చేరుకొని బాలిక తండ్రిని దారుణం గా కొట్టారు. పోలీసులతో మాట్లాడి కులదీప్ సెంగారే ఈ దారుణానికి పాల్పడినట్లు  బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులు సీబీఐ కు అప్పగించాలని వారు డిమాండ్ చేసారు. కాగా, విచారణ లో కులదీప్ సింగర్ దోషిగా తేలాడు. దీనితో, అతనికి ఢిల్లీ కోర్టు ఉరిశిక్షను విధించింది.