మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివ రాజ్ సింగ్ చౌహన్..!

post

బల పరీక్షను ఎదుర్కొకుండానే, ముఖ్యమంత్రి కమలనాధ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే సన్నాహాల్లో బీజేపీ పార్టీ మునిగిపోయింది. ముఖ్యమంత్రి గా శివ రాజ్ సింగ్ చౌహన్ నిలబడినట్లు వార్తలు వచ్చాయి. ఆయన మధ్యప్రదేశ్ లో ఇప్పటికే మూడుసార్లు ఏకధాటిగా ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడ్డారు. ఆయన, తిరిగి నాలుగవసారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

   జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీ కి రాజీనామా చేసిన తరువాత మధ్యప్రదేశ్ లో రాజకీయం గా చాల మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిలో భాగంగా, ఆయన అనుచరులైన ఇరవైరెండు మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసారు. దీనితో కమలనాధ్ ప్రభుత్వం మైనారిటీ లో పడిపోయింది. బల పరీక్షను నిర్వహించాలని బీజేపీ పార్టీ వర్గాలు కమలనాధ్ పై వత్తిడి తెచ్చాయి. సుప్రీమ్ కోర్ట్ కూడా బలపరీక్షను నిర్వహించాలని తీర్పునిచ్చింది. దీనితో, ఆయన బలపరీక్షను నిర్వహించకుండానే ముఖ్యమంత్రి పదవి కి రాజీనామా చేసాయి. ఇక, బీజేపీ పార్టీ మరోసారి మధ్యప్రదేశ్ లో అధికార పీఠాన్ని అధిష్టించబోతోంది.