హిట్లర్ కే పతనం తప్పలేదు.. : నాగబాబు 

post

జనసేన ఆవిర్భావ దినోత్సవం నేపధ్యం లో  రాజమండ్రి లో ఆ పార్టీ నేతలందరూ సమావేశమైన సంగతి విదితమే. ఇందులో నాగబాబు మాట్లాడారు. నాలుగేళ్లలో జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, 'మొదటిసారిగా ఇలా  జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతున్నాను. ఎక్కువ సమయం మాట్లాడదలుచుకోలేదు. పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ లాంటి వారు ఉన్నారు.. వారికి సమయం ఇవ్వడానికి ప్రాధాన్యతనిస్తాను' అని అన్నారు. 
       స్థానిక ఎన్నికల నేపధ్యం లో నామినేషన్ వేయడానికి వచ్చిన వారిని కత్తులతో పొడవడం, కర్రలతో కొట్టడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పరిస్థితిలు ఎలా ఉన్నా, జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారని, భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు. ఇటువంటి బెదిరింపులు మామూలేనని ఆయన అన్నారు. హిట్లర్ కంటే గొప్పోళ్ళు ఎవరు ఇక్కడ లేరని, అటువంటి హిట్లర్ కె పతనం తప్పలేదని, ఇది కూడా ఎంతోసేపు ఉండదని ఆయన అన్నారు. 
     ఆయన ఇంకా మాట్లాడుతూ, 'బండరాయి మీద ఓ దెబ్బేస్తే అది పగలదు. 99 దెబ్బలేసినా పగలదు.. 100వ దెబ్బేస్తే పగులుతుంది. మన జనసేనాని కూడా ఇప్పటికే చాల దెబ్బలు కొట్టారని, ఎదో ఒక రోజు ఈ 'కుళ్ళిన రాజకీయాలు' అనే బండరాయి కచ్చితం గా మిగులుతుందని, నాలుగేళ్లలో జనసేన తప్పకుండ అధికారం లోకి వస్తుందని' ఆయన అన్నారు.