ఢిల్లీ అల్లర్ల పై అమిత్ షా వివరణ..!

post

దేశం లో ఒక్కసారి గా అల్లకల్లోలం సృష్టించిన ఢిల్లీ అల్లర్ల గురించి అందరికి తెలిసిందే. కాగా, ఈ అల్లర్లకు గల కారణాలు వివరిస్తూ, అల్లర్ల వెనుక జరిగిన కుట్రలో పాలుపంచుకున్న వారి గురించి వివరణ ఇచ్చారు. ఈ అల్లర్ల వెనుక ఐసిస్ హస్తముందని హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. ఐసిస్ అనుమానితున్ని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఆయన తెలిపారు. విచారణ కోసం మరో సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం, ఆధారాలు తన వద్ద ఉన్నట్లు ఆయన తెలిపారు.

మారణహోమం వెనక  ఫేక్ ఖాతాలు..!

సోషల్ మీడియా లో అల్లకల్లోలం సృష్టించడానికి ఢిల్లీ అల్లర్ల కు రెండురోజుల ముందు కొన్ని వేల ఫేక్ ఖాతాలు సృష్టించబడ్డాయని, అవి అన్ని ఫిబ్రవరి 25 తరువాత నీవీర్యం అయ్యాయని ఆయన తెలిపారు. అల్లర్లను వ్యాప్తి చేయడం కోసమే ఈ అకౌంట్లను సృష్టించారని ఆయన చెప్పారు. ఖాతాలను నిర్వీర్యం చేసినంత మాత్రాన ఖాతాదారులు క్షేమం అని అనుకోలేరని, ఇది డిజిటల్ యుగం అని, వారిని వెతికి పట్టుకుని చట్టం ముందు హాజరుపరుస్తామని అమిత్ షా చెప్పారు.

దేశం లో విదేశీ కరెన్సీ..!

ఫిబ్రవరి ఇరవై నాలుగు కంటే ముందుగా విదేశీ సంస్థల తో పాటు కొన్ని స్వదేశీ సంస్థలు కూడా డబ్బులని పంపిణి చేశాయని ఆయన చెప్పారు. ఈ విషయం పై ప్రాధమిక విచారణ సాగుతుండగా అల్లర్లు ప్రారంభం అయ్యాయని ఆయన చెప్పారు. అల్లర్ల కు ముందే దేశం లో విదేశీ కరెన్సీ పంపిణి అయ్యిందని, అల్లర్లకు బాధ్యులైన వారిని ఎవరిని వదిలేది లేదని అమిత్ షా స్పష్టం చేసారు. ఈ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దీనికి కారణమైనది ఎంతటి వారైనా శిక్ష తప్పదని ఆయన అన్నారు. ఢిల్లీ అల్లర్లకు కారణమైన వారిని గుర్తించే విషయంలో ఆధార్ డేటాను వాడమని ఆయన చెప్పారు. ఇప్పటికే ఓటర్‌ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల ఆధారంగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ద్వారా దాడులతో సంబంధం ఉన్న దాదాపు 1992 మందిని గుర్తించామని చెప్పారు. 2647 మందిని అరెస్ట్‌ చేసి, 712 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని తెలిపారు.

ప్రభుత్వమెప్పుడు సిద్దమే..!

ఢిల్లీ అల్లర్ల గురించి చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఎపుడు సిద్ధం గా ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. మతపరమైన అంశం కావడం తో హోలీ పండుగ తరువాత ఈ విషయం పై ఉభయ సభల్లో చర్చిస్తాం అని చెప్పారు. ఈ అంశం పై హేతుబద్ధం గానే విచారణ జరుపుతామని, దోషులెవరు తప్పించుకోవడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేసారు. అల్లర్లను ప్రోత్సహించడం బీజేపీ విధానం కాదని చెప్పారు. దేశంలో ట్రంప్‌ పర్యటిస్తున్న వేళ ప్రభుత్వమే హింసాకాండను ఎందుకు ప్రోత్సహిస్తుందని ఆయన తిరిగి ప్రశ్నించారు.