ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్ల తయారీలో రైల్వేలు..!

post

కరోనా  నియంత్రణలో భాగంగా ప్రభుత్వానికి భారతీయ రైల్వేలు తమ వంతసాయం అందిస్తున్నాయి. ఇప్పటికే పీపీఇ ల తయారీ, రైల్వే బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చడం లో రైల్వేల పాత్ర తెలిసిందే. తాజాగా  ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఉపయోగపడే ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లను పెద్ద ఎత్తున తయారు చేశాయి.

దేశంలోనిఅన్ని జోనల్ రైల్వేస్, ప్రొడక్షన్ యూనిట్లు, పీఎస్‌యూలలో  ఈ నెల 7 వరకు దాదాపు 5,82,317 ఫేస్ మాస్క్‌లు, 41,882 లీటర్ల శానిటైజర్ తయారు చేశాయి . ఈ ఫేస్ మాస్క్‌లు పునర్వినియోగానికి ఉపయోగపడతాయి.

భారతీయ రైల్వేలలో నిరంతరం పని చేస్తున్న ఆపరేషన్, మెయింటెనెన్స్ స్టాఫ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, నిబంధనల ప్రకారం సబ్బు, నీరు, , ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్ అందుబాటులో ఉంచినట్లు .రైల్వే శాఖ తెలిపింది