మరో ఆరు నెలల్లో కరోనా వ్యాక్సిన్..!

post

కోవిడ్-19 నివారణకు  వ్యాక్సిన్ రూపకల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ పరిశోధకులు రాబోయే ఆరు నెలల్లో ఈ  వ్యాధికి  వ్యాక్సిన్  తయారు చేయగలమని   చెబుతున్నారు.  దీనికి సంబంధించిన  పరిశోధనలు  దాదాపు పూర్తి కావచ్చినట్టేనని తాజాగా ప్రకటించారు.
 
. 2020 సెప్టెంబరు, డిసెంబరు మధ్య కాలం నాటికి  తొలి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని  లక్ష్యంగా పెట్టుకున్నామని బ్రిటన్‌ చీఫ్‌ సైంటిఫిక్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ వివరించారు.  ఈ నెలాఖరు నుంచి సెప్టెంబర్‌ వరకు 500 మంది వాలంటీర్లపై  పరిశోధనలు  నిర్వహించిన అనంతరం కచ్చితమైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని చెప్పారు.  కనీసం 2021 ప్రారంభంనాటికి  వ్యాక్సిన్ సిద్ధమవుతుందని  ఆయన ధీమా వ్యక్తం చేశారు.  చైనా లో మార్చి 17నుంచి  క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించామని పరిశోధకులు చెప్పారు. మొదటిదశలో చైనాకు చెందిన  18 నుంచి 60 సంవత్సరాల వయసున్న 108 మందిపై పరిశోధనలు జరిపామని 18 మంది అబ్టర్వేషన్‌ పూర్తయిందని, వారంతా కరోనా నుంచి బయటపడ్డారని వివరించారు. వారంతా 14 రోజుల ఐసోలేషన్‌ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లినట్టు  వివరించారు. మరో ఆరు నెలల పాటు వీరి నుంచి రక్త నమూనాలు సేకరిస్తూ,  పరిశోధనలు జరుపుతామని, అనంతరం కచ్చితమైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు. స్త్రవేత్తలు తెలిపారు.