కరోనా తగ్గాకే విమాన సర్వీసులు..!

post

భారత ప్రజలకు కరోనాతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్న ధీమా పెరిగిన తర్వాతే విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్‌దీప్ సింగ్ బుధవారం స్పష్టం చేశారు.  దేశీయ, అంతర్జాతీయ విమానాలపై రాకపోకలు నిషేధించడంతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి చుట్టే తన మనస్సు తిరుగుతోందని, అయినా లాక్‌డౌన్ విధించడం తప్పదని ఆయన పేర్కొన్నారు..ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సహకరిస్తున్న వారందరికీ ఆయన ఈ సందర్భంగా  ధన్యవాదాలు తెలిపారు. కరోనా  నేపథ్యంలో మార్చి 25 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించింది.