కోవిడ్-19 నిర్థారణ పరీక్షలను ఉచితంగానే నిర్వహించాలి :సుప్రీం కోర్డు

post

కోవిడ్-19 పరీక్షలు చాలా ఖరీదైనవిగా మారాయని, దేశంలోని ప్రజలందరికీ ఈ పరీక్షలను ఉచితంగానే నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని  శశాంతక్ దేవ్ సూధి అనే న్యాయవాది  సుప్రీంలో పిల్ దాఖలు చేసారు

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తించిన ప్రైవేటు ల్యాబొరేటరీలలో కోవిడ్-19 నిర్థారణ పరీక్షలను ఉచితంగానే నిర్వహించాలని తెలిపింది.

విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ 118 ల్యాబొరేటరీలు రోజుకు 15,000 పరీక్షలు నిర్వహించే సామర్థ్యంతో పని చేస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా 47 ప్రైవేటు ల్యాబొరేటరీలను కూడా ఈ పరీక్షల కోసం రంగంలోకి దించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ప్రైవేటు ల్యాబొరేటరీలు పరీక్షల కోసం భారీ సొమ్మును వసూలు చేయకుండా జాగ్రత్తవహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరీక్షల కోసం  తగిన యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పేర్కొంది.