యూపీలో పోలీసులకు ఆరోగ్య భీమా..!

post

కరోనా ప్రబలుతున్న వేళ, లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు మాత్రం నిరంతరం తమ విధులు నిర్వర్తిస్తూనే వున్నారు. వీరి సేవలగురించి ఎంత చెప్పినా తక్కువే. దీన్ని గమనించే పంజాబ్ ప్రభుత్వం .. పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు రూ.50లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇపుడు యూపీ  సర్కార్ కూడ అదే బాటలో సాగుతోంది. లాక్‌డౌన్ సమయంలో నిబద్ధతతో డ్యూటీలు చేస్తున్న . ఒక్కో పోలీసుకు రూ.50లక్షల ఆరోగ్యబీమా అందించనున్నట్లు యూపీ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ అవానిష్ అవస్థి బుధవారం తెలియజేశారు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాతపూర్వకంగా ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పారు.