కాబుల్ లో ఉగ్ర దాడులు..!

post

ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ లో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కాబూల్ రక్తసిక్తమైంది. సిక్కుల ప్రార్థనా మందిరం గురుద్వారలో ఈ ఉగ్రవాదులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో దాదాపు పదకొండు మంది ప్రాణాలు విడిచారు. చాల మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దుర్ఘటనని భారత ప్రభుత్వం తీవ్రం గా ఖండించింది. 
           వివరాల్లోకెళితే, అక్కడి కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 7.45 నిమిషాలకు ఇక్కడి షోర్‌ బజార్‌లోని గురుద్వారలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు ముందు, అక్కడ సుమారు గా ఓ నూట యాభై మంది వరకు జనాభా ఉన్నట్లు అంచనా. వీరు ప్రార్ధనలు చేస్తున్న సమయం లో, కొందరు ముష్కర మూక  ఆయుధాలు, బాంబులు ధరించి గురుద్వారా లోపలి ప్రవేశించారు. ప్రార్ధనలు జరుగుతుండగానే, వారిపై దాడికి తెగబడి  కాల్పులకు దిగారు. దీనితో, పదకొండు మంది అక్కడికక్కడే మృతి చెందారు. 
        సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలు అక్కడికి చేరుకున్నాయి. వారిపై ప్రతిదాడికి దిగాయి. కాగా, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. మరో ముగ్గురు కాల్పులు జరుపుతున్నారని సమాచారం. ఈ ఘటనపై పూర్తి బాధ్యత తమదేనని ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ తెలిపింది. గురుద్వారా లో పదకొండు మంది చిన్నారులను భద్రతా దళం సురక్షితం గా కాపాడింది. ఓ వైపు కరోనా మహమ్మారి తో ప్రపంచం సతమతమవుతుంటే, ఇటువంటి దాడులకు దిగడాన్ని భారత్ క్రూరమైన చర్యగా వర్ణించింది. అయినప్పటికీ, ఆఫ్గాన్ లోని సిక్కులకు మరియు హిందువులకు భారత ప్రభత్వం రక్షణ కలిపిస్తుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.