రష్యాలో భూకంపం..!

post

కరోనా మహమ్మారి వికృత రూపం ఓ వైపు వణికిస్తుంటే, మరోవైపు ప్రకృతి భూకంపం రూపం లో భయపెడుతోంది. గతవారం లో గ్రీస్, క్రోయేషియా లలో భూకంపం వచ్చినట్లు తెలిసింది. తాజాగా రష్యాలో భూకంపం వచ్చింది. బుధవారం ఉదయం దేశం లోని కురిల్ దీవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ భూకంపము రిక్టార్ స్కేల్‌పై 7.5గా నమోదు అయింది. ఈ విషయాన్నీ  యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే ధృవీకరించింది. రష్యన్ పట్టణానికి దాదాపు రెండువందల కిలోమీటర్ల దూరం లో ఉన్న కురిల్ దీవుల్లో 56.7 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది అని సైంటిస్ట్స్ చెపుతున్నారు.