ఆధార్, పాన్ కార్డుల లింకుకు గడువు పొడిగింపు..!

post

దేశ ప్రజలకు భారత ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ శుభవార్త చెప్పారు. ఆధార్, పాన్ కార్డుల లింకు చేయడానికి గడువును పొడిగిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ దేశం లోను విస్తరిస్తున్న తరుణం లో ఆమె ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈరోజు, కరోనా వైరస్ వల్ల వచ్చిన ముప్పు గురించి, నివారణ చర్యల గురించి మీడియా సమావేశం లో మాట్లాడిన ఆమె ఆధార్ కార్డు విషయం పై కూడా స్పందించారు. నిజానికి, ఆధార్ మరియు పాన్ కార్డుల లింకుకు గడువు ఈ నెల ఇరవై ఆరవ తేదీతో ముగియనుంది. తాజాగా, ఆ గడువు తేదీని పెంచుతున్నట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ అధికారిక ప్రకటన చేసారు. 
  ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఏఏలోని సబ్‌సెక్షన్ 2 ప్రకారం ఆధార్, పాన్ కార్డును కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలని సీబీడీటీ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. గతం లోను, ఈ గడువును పొడిగించారు. ఇప్పటిదాకా ఆధార్, పాన్ కార్డుల లింకు చేయడానికి దాదాపు తొమ్మిదిసార్లు గడువును పొడిగించారు. 2017 జూలై 1 వరకు జారీ అయిన పాన్ కార్డులను కచ్చితం గా ఆధార్ కార్డు తో లింక్ చేయాలనీ అధికారులు ఆదేశిస్తున్నారు. 
    జనవరి 27 నాటికి చూస్తే దేశంలో 30.75 కోట్లకు పైగా పాన్ కార్డు దారులు తమ ఆధార్ కార్డు ను పాన్ కార్డు తో లింక్ చేసారు. ఇంకా దాదాపు 17.58 కోట్ల మంది తమ పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేయవలసి ఉంది. మరిన్ని సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే, ఆధార్ ను పాన్ తో తప్పని సరిగా లింక్ చేయాలి అని నిబంధనలు పేర్కొంటున్నాయి.