కరోనా టైం లో కేంద్ర ఆర్థిక మంత్రి ఊరట..!

post

కరోనా వైరస్ కోరలు విప్పిన నేపథ్యం లో భారత్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ ఓ మీడియా సమావేశం లో పాల్గొన్నారు. అందులో ఆమె బ్యాంకింగ్ సేవల గురించి మాట్లాడుతూ సగటు సిటిజన్ కు ఊరట కలిగించే వార్త చెప్పారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న కొన్ని నిబంధనలను ఓ మూడు నెలల పాటు సడలిస్తున్నట్లు తెలిపారు. 
 ఇకనుంచి ఓ మూడు నెలల పాటు బ్యాంకులో మినిమమ్ బాలన్స్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఇంకా, ఖాతాదారులు ఈ ఎటిఎం నుంచి డబ్బు తీసుకున్నా ఫైన్ పడదు. బ్యాంకులు ఇచ్చే ఇతర సేవలకు కూడా రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓ మూడు నెలలపాటు ఈ నిబంధనలను సడలిస్తున్నట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యం లో ఈ నిర్ణయాలు సామాన్యులకు ఊరట కలిగించనున్నాయి.