ఓనర్లూ..ఇంటి అద్దె అడగకండి..!

post

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తం గా ముప్పును తీసుకొచ్చింది.ఈ నేపధ్యం లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఓ వైపు పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు మధ్యతరగతి కుటుంబాలకు, రోజుకూలీలను ఈ విపత్కర పరిస్థితిలో ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యం లోనే, ఢిల్లీ ముఖ్యమంత్రి సరికొత్తగా విజ్ఞప్తి చేసారు. ఇల్లు గల ఓనర్లను దయచేసి ఇంటి అద్దె అడగవద్దని, లేటు గా తీసుకోండి, లేదా ఈసారికి వదిలివేయండి అని విజ్ఞప్తి చేసారు. పరిస్థితి కష్టతరం గా ఉందని, మధ్యతరగతి కుటుంబాలను, రోజుకూలీలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అయన చెప్పుకొచ్చారు. ఓనర్లు ఇంటి అద్దె కోసం వేధించొద్దని ఆయన కోరారు. బలవంతం గా కిరాయి కి ఉన్నవారి వద్ద నుంచి సొమ్ము ను తీసుకోవద్దని కోరారు.కరోనా వల్ల ఒకటి లేదా రెండు నెలలు ఆలస్యమైతే.. అద్దె కోసం వారిని బలవంత పెట్టొద్దని, ఓపిక పట్టమని కేజ్రీవాల్ తన రాష్ట్ర ప్రజలను కోరారు. రాష్ట్రము లో ఎవరు ఆకలి బాధకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన చెప్పుకొచ్చారు.