లాక్ డౌన్ లో ఇవి పాటించండి..!

post

లాక్ డౌన్ అంటే.. ఇప్పటివరకు ఇళ్లనుంచి బయటకు రాకూడదు అని అనుకుంటూ ఉన్నారు. అసలు లాక్ డౌన్ వెనుక ఉద్దేశాలు తెలుసుకోండి. గుంపులు గుంపులు గా ఉండడం వల్ల వ్యాప్తి ఎక్కువ జరుగుతుంది కాబట్టి  లాక్ డౌన్ విధించారు. ఈ సమయం పాటించాల్సినవి ఇవే..

 ఐదుగురికి  మించి ఎక్కువ మంది కలిసి బయట తిరగకూడదు. 

ప్రయాణాలు విహారయాత్రలు  ప్రభుత్వం పూర్తి గా నిషేధించింది.

ఎలాంటి ఫంక్షన్లకు అనుమతి లేదు,

విదేశాల నుంచి వచ్చిన వారు బయటకు రాకుండా సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలి. 

బస్సులు, క్యాబ్, మెట్రో, ఆటో సర్వీసులను పూర్తి గా బంద్ చేసారు. 

వృద్ధులను, చిన్నపిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోండి. 

గుళ్ళు, మసీదులు, చర్చి వంటి మతపరమైనవి కూడా మూసివేశారు. జన సమూహాలను అరికట్టడం కోసం వీటిని నిషేధించారు. 

   ఇది ఇలా ఉంటె, కొన్ని అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం కొన్ని మినహాయింపులను కూడా ఇచ్చింది.

మరీ అత్యవసరం ఐతే తప్ప బయటకు రావద్దని సూచించింది,

నిత్యావసర సరుకులను కొనుక్కోవచ్చు. 

అత్యవసర సేవల ఉద్యోగులు బయటకు వెళ్ళవచ్చు. 

ఎటిఎం లలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

తప్పని సరై బయటకి వస్తే, రెండు మీటర్ల దూరం పాటించండి. పరిశుభ్రం గా ఉండండి. ఐతే, టెలికాం, ఇంటర్నెట్, పోస్టల్ సేవలు కొనసాగనున్నాయి.