చంపేస్తారని విగ్రహాలు చేయించుకున్న ఎమ్మెల్యే..!

post

 ఏ రంగంలో నైనా ప్రముఖులుగా పేరు పొందినవారి మరణానంతరం వారి విగ్రహాలను  అభిమానులు ఏర్పాటు చేయడం సహజం. అయితే తాను చనిపోయిన తరువాత  తనను మరచి
పోకూడదని తన విగ్రహాలను తానే ముందుగా తయారు చేయించుకున్న ప్రముఖుడి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సౌత్ 24 పరగణాలు జిల్లాలోని గోసాబా నియోజవర్గ
ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌(71) మూడేళ్ల క్రితం కోల్‌కతాలో పేరుగాంచిన శిల్పితో రెండు విగ్రహాలను తయారు చేయించుకున్నారు. అయితే ఇటీవల తన నివాసంలో జరిగిన పార్టీ
సమావేశంలో ఈ విగ్రహాల విషయం అందరికీ తెలిసిపోయి ఈ విగ్రహాల ఫోటోలు వైరల్‌ కావడంతో ఆయన ఈ విషయంపై స్పందించారు. తనకు ప్రాణహాని ఉందని, తాను హత్యకు గురై
చనిపోతే.. ప్రజలను మర్చిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాలను తయారు చేయించానని చెప్పుకొచ్చారు.
   ‘గతంలో నలుగురు హంతకులు అలిపోర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ నుంచి తప్పించుకుని . కొద్ది రోజుల తర్వాత మళ్లీ పట్టుబడ్డారన్న నాస్కర్  అన్నారు. వారిని విచారించగా..
కొంతమంది నాయకులు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందని  ఈ విషయాన్ని తనకు జిల్లా ఎస్పీ ప్రవీణ్‌ త్రిపతి చెప్పారన్నారు.. ఆ తరువాత తనకు ‘వై’ కేటగిరి
భద్రతను కూడా ఏర్పాటు చేశారని . అయినప్పటికీ  ప్రాణహాని ఉందంటున్నారు.  ఏ క్షణంలోనైనా తాను  హత్యకు గురయ్యే అవకాశముందని . అందుకే విగ్రహాలు తయారు
చేయించానని  ఎమ్మెల్యే నాస్కర్‌ అన్నారు. తనకు టీఎంసీలోనే ఎక్కువ శత్రువులు ఉన్నారని, వారంతం ఇంతకు ముందు ఇతర పార్టీలో ఉండేవారని  అంటున్నారు. అయితే . జయంత్‌కు
రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం గమనార్హం.