584 కు చేరిన కరోనా కేసులు..11 మంది మృతులు..!

post


సూర్యుడు ప్రతాపం హెచ్చుతున్న రోజుల్లో కూడా కరోనా తన మొండితనాన్ని తగ్గించుకోవట్లేదు. దీనితో రోజు రోజు కు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరు లో ఒకరు, తమిళనాడు లో ఒకరు చనిపోవడం లో కరోనా మృతుల సంఖ్యా పదకొండు కు చేరింది. కేసుల సంఖ్యా కూడా 492 నుంచి 584 కు చేరింది. ఎంత పటిష్టం గా చర్యలు తీసుకున్న కరోనా ను కట్టడి చేయడం గగనతరం గా ఉంది. రాష్ట్రాలకు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయినా కేసుల సంఖ్యా పెరుగుతూనే ఉండటం దేశ ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోంది. 
        అత్యధికం గా మహారాష్ట్ర లో నూటపన్నెండు కేసులు నమోదు అయ్యాయి. 109 కేసులతో కేరళ తరువాతి స్థానం లో ఉంది. కర్ణాటక లో 41 కేసులు, తెలంగాణ లో 39 కేసులు, గుజరాత్ లో 38 కేసులు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఎనిమిది కేసులు ఉన్నాయి.