12 గంటలు కాదు.. ఏకంగా 17 రోజుల పైనే కరోనా వైరస్ బతికే ఉంటుంది...!

post

ఇటీవల నరేంద్ర ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పాటించమని కోరిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపధ్యం లో, చాలామంది కరోనా వైరస్ ఉపరితలం పై పన్నెండుగంటల కంటే ఎక్కువసేపు ఉండలేదని ప్రచారం జరిగింది. దీనిపై ఓ వాట్సాప్ స్టేటస్ కూడా నెట్ లో చక్కర్లు కొట్టింది. తాజాగా, ఈ కరోనా వైరస్ పదిహేడు రోజులపాటు ఓ షిప్ ఉపరితలం పై బ్రతికి ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పరిశోధకులు గుర్తించి తెలిపారు. 
   చైనా లో కరోనా వైరస్ భీబత్సం సృష్టిస్తున్న సమయం లో, ప్రముఖ పర్యాటక నౌక డైమండ్ ప్రిన్సెస్ జపాన్ లోని యోకహామా రేవులో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయం లో ఆ పడవలో దాదాపు  700 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీనితో, తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. కొన్ని రోజుల పాటు, పడవలోనే ఉండిపోయినా తరువాత వారిని అక్కడినుంచి తరలించారు. దాదాపు రెండు వారాలపాటు ఈ తరలింపు కార్యక్రమం కొనసాగింది. తాజాగా, ఇప్పటికీ పదిహేడు రోజులు  కావొస్తున్నా డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలోని క్యాబిన్లలో కరోనా వైరస్ ఉనికి అక్కడే ఉంది. ఇది ఆ వైరస్ మొండితనాన్ని సూచిస్తోందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.