పోలీసుల అధీనం లో 4500 వాహనాలు..!

post

ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ని సమూలంగా నిర్ములించడానికి ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తం గా పటిష్ట చర్యలు చేపడుతూ జాగ్రత్తలు పాటించాలని పిలుపినిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, కొంతమంది ప్రజలు ప్రధాని ఆదేశాలను, ప్రభుత్వాల సూచనల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ రోడ్లమీదకు రావడం ప్రధానికి ఆందోళన కలిగిస్తోంది. దీనితో, లాక్ డౌన్ ను కఠినం గా అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసారు. ప్రధాని ఆదేశాల మేరకు పోలీసులు రంగం లోకి దిగారు. రోడ్లపైకి తిరుగుతున్నా ప్రతి ఒక్కరిని పట్టుకుని కారణాలు అడుగుతున్నారు. సరైన అనుమతి, కారణం లేకుండా బయటకు వచ్చిన వారిని తిరిగి ఇళ్లకు పంపించేస్తున్నారు. కొంతమంది భారీ గా ఫైన్లు విధిస్తున్నారు. పరిస్థితులను అర్ధం చేసుకుని సహకరించాలని వారు ప్రజలను కోరుతున్నారు. 
      ఆకతాయితనం తో రోడ్లమీద కు వచ్చి పోలీసుల మాటలు పట్టించుకోకుండా వాగ్వాదాలకు దిగుతున్న వారిని పోలీసులు మందలించి వారి వాహనాలను సీజ్ చేసారు. లాక్ డౌన్ పూర్తి అయినా తరువాత మాత్రమే వాటిని తిరిగి అప్పగిస్తామని చెప్పుకొచ్చారు. అలా ఇప్పటివరకు 4500 వెహికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జీవో 45, 46లను ఉల్లంఘిస్తూ తిరిగినందుకు 188 ఐపీసీ కింద వారిపై కేసులు నమోదు చేసారు. ఒక్క  హైదరాబాదు లోనే మూడువేల పై వరకు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైదరాబాదు లో 73 చోట్ల చెక్​పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  సైబరాబాద్ లో 244, రాచకొండ కమిషనరేట్​పరిధిలో 159 వెహికిల్స్ ను పట్టుకున్నామని , ఇతర జిల్లాల్లో మరో పదిహేను  వందల వరకు స్వాధీనం అయ్యాయని పోలీసులు తెలిపారు.