బాలికలకు 20 శాతం సీట్లు..!

post

ఇంజినీరింగ్‌ విద్య లో మహిళలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్దల ప్రవేశాల్లో బాలికలకు మొదటి ప్రాధాన్యం వున్నప్పటికీ ప్రతిష్టాత్మక సంస్దల్లో ఇంతవరకూ వీరికి ఎటువంటి రిజర్వేషన్లు లేవు. \

       ఇపుడు మొదటి సారిగా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో అమ్మాయిలకు   20 శాతం సీట్లు కేటాయించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అమ్మాయిలకు ఈ సీట్లు కేటాయిస్తారు. వారికి సీట్లు పెంచినందున ఇతరుల కోటాను తగ్గించారు.2020-21 విద్యాసంవత్సరంలో సూమర్‌ న్యూమరరీ కోటా కింద వీటిని కేటాయిస్తారు.వాస్తవానికి ఐఐటీల్లో ఇప్పటికే కొన్ని సీట్లను  గత రెండేళ్ల నుంచి ఈ కోటా కింద బాలికలకు  కేటాయించడం జరుగుతున్నప్పటికీ దాన్ని 20 శాతం పెంచారు.
వచ్చే నెలలో జేఈఈ మెయిన్‌ చివరి విడత పరీక్ష ఏప్రిల్‌లో జరుగుతోంది.ఈ ఏడాది   జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను  ఐఐటీ ఢిల్లీ నిర్వహిస్తుంది. అడ్వాన్ఫ్ డ్ పరీక్ష కు  2.50 లక్షల మందికి అవకాశం  ఇచ్చే అవకాశముంది. అడ్వాన్స్ డ్ పరీక్ష టైమ్ టేబుల్, ఫీజు, సిలబస్ లను ఐఐటీ ఢిల్లీ విడుదల చేసింది.అభ్యర్దులు . మే 1 నుంచి  ఆన్‌లైన్‌ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.2,800 కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బాలికలకు మాత్రం రూ.1400 . తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ అడ్వాన్స్ డ్ పరీక్ష కు హాజరయ్యే అభ్యర్దుల కోసం ఏపీలో 16, తెలంగాణలో 7 ఆన్ లైన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఐఐటీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ప్రవేశాలు పొందాలనుకునే వారు 2020 ఏప్రిల్‌ 1వ తేదీ తరువాత తహశీల్దార్ ధ్రవీకరణ చేసిన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.