నిద్రపోయిన ఉబర్ డ్రైవర్...తానే కారు నడుపుకున్న కస్టమర్..!

post

ఉబర్ లాంటి ఇతర క్యాబ్ బుకింగ్ లు మన ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసాయి. కానీ, అపుడపుడు బుకింగ్ కాన్సల్ అవడం, రిఫండ్ రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కొంతమేర అవి సగటు ప్రయాణికులకు ఉపయోగకరం గానే ఉంటున్నాయి. ఇటీవల ఓ మహిళకు ఉబెర్ క్యాబ్ లో వింత అనుభవం ఎదురైంది. దీనిపై ఆమె ఘాటు గా స్పందించి, సోషల్ మీడియా లో షేర్ చేసారు.

ఇంతకీ ఏమి జరిగిందంటే..?

    ఫిబ్రవరి 21 పూణే లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. పూణే లోని తేజశ్రీ దివ్య నాయక్ అనే మహిళ పూణే నుంచి ముంబై వెళ్ళడానికి ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఐతే, డ్రైవింగ్ స్టార్ట్ చేసిన తరువాత డ్రైవర్ కారు నడుపుతూ కాల్ మాట్లాడటం ప్రారంభించాడు. దీనితో ఆమె వద్దని వారించింది. తరువాత కొద్ది సేపటికే అతను నిద్ర లోకి జారుకున్నాడు. ఇలా కాదని, ఆమె కారు తాను డ్రైవ్ చేస్తానని, కాసేపు విరామం తీసుకోమని, వెన్నునెప్పి కారణం గా ఎక్కువ సేపు నేను నడపలేను అని కూడా చెప్పింది. సగటు డ్రైవర్ సీటు మరి తిరిగి కాల్ మాట్లాడటం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఆమె ను బాగా డ్రైవ్ చేస్తున్నారంటూ పొగడటం ప్రారంభించాడు. తర్వాత నిద్ర లోకి జారుకున్నాడు. అరగంట లో ముంబై చేరుకుంటాం అనగా, అతను నిద్ర లోంచి లేచాడు. అతను నిద్రపోతుండగా ఆమె వీడియో లను ఫోటోలను తీసింది. అతని వాలకం తో ఆమెకు బాగా కోపం వచ్చింది. తరువాత ఈ ఘటన గురించి సోషల్ మీడియా లో పెట్టింది.

కస్టమర్ల ప్రాణాలు రిస్క్ లో పెడతారా..?

అతని వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఉబెర్ కంపెనీ వారిని టాగ్ చేసింది. 'ఇది జరిగినపుడు నేను నిద్రలో లేకపోవడం, నాకు డ్రైవింగ్ తెలిసి ఉండటం వల్ల నేను తప్పించుకోగలిగాను. నేను కోపం గా ఉన్నా. కానీ ఎంత ధైర్యం ఉంటె డ్రైవర్లు రెస్ట్ లేకుండా డ్యూటీ కి వస్తారు. ఎంత ధైర్యం ఉంటె తోటి వారి ప్రాణాలను రిస్క్ లో పెడతారు.' అంటూ పోస్ట్ చేసింది.